10-08-2025 02:30:07 PM
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మర్రిగూడ మండల(Marriguda Mandal) పరిధిలోని తిరుగండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు సాయిలు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న(2004-2006) బ్యాచ్ వారి స్నేహితులు వారి కుటుంబానికి 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారి స్నేహితులు మాట్లాడుతూ, సాయిలు చనిపోవడం చాలా బాధాకరమని, మేము చదువుకునే రోజుల్లో ఎంతో క్రమశిక్షణతో ఆయన మెలిగేవారని, అలాంటి వ్యక్తి మా మధ్యలో లేకపోవడం ఎంతో బాధగా ఉందని వారు అన్నారు. సాయిలు కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలిమినేటి కార్తీష్ రెడ్డి, నీల ఆంజనేయులు, ఆడపు జంగయ్య, నిరంజన్, ప్రవీణ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.