10-08-2025 02:34:29 PM
ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాలయాపన కన్నా స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి..
చిన్న పెట్టుబడులతో భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలి..
మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి..
కోదాడ: యువత స్వశక్తితో ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(Former MLA Bollam Mallaiah Yadav), హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(Former MLA Shanampudi Saidireddy)లు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో కోర్టు ఎదురుగా ఏర్పాటు చేసిన లూలూ ఫ్యాషన్స్ స్టోర్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తూ కాలయాపన చేయడం కంటే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం మేలన్నారు. చిన్న పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించి భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలన్నారు. తాము ఉపాధి పొందడంతో పాటు మరి కొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ట్రెండ్ కు సరిపోయే విధంగా నాణ్యమైన వస్త్రాలను విక్రయించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో లూలూ ఫ్యాషన్స్ స్టోర్ యజమాని కార్తీక్ తదితరులు ఉన్నారు