15 April, 2026 | 10:39 AM

ఏడుపాయల్లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

10-01-2026 05:19 PM

పాపన్నపేట పీహెచ్సీలో పండ్లు పంపిణీ చేసిన సర్పంచ్ పావని నరేందర్ గౌడ్

విజయక్రాంతి,పాపన్నపేట: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో శనివారం ఘనంగా నిర్వహించారు. పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేరుమీద వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి హన్మంతరావు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించాలని,  సుఖ సంతోషాలను ప్రసాదించాలని, మరెన్నో ఉన్నతమైన పదవులు వచ్చేలా దీవించాలని అమ్మవారిని మొక్కుకొని ప్రార్థించారు.

అనంతరం ఆలయ రాజగోపురం ప్రాంగణంలో  భారీ కేక్ కట్ చేసి హన్మంతరావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పాపన్నపేటలో గ్రామ సర్పంచ్ లింగంపేట పావని నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.