calender_icon.png 11 January, 2026 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి ప్రజా ప్రతినిధులు, నాయకులకు సన్మానం

10-01-2026 05:16:40 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ లో శనివారం ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులను బిజెపి శనివారం ఘనంగా సన్మానించారు.  బీజేవైఎం నాయకులు పొన్నం మణికాంత్ నారాయణరావ్ పల్లి ఉపసర్పంచ్ గా గెలుపొందగా వారిని, గట్టెపల్లి వార్డు సభ్యునిగా గెలుపొందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్ కుమార్ ని, అదేవిధంగా బీజేవైఎం మండల అధ్యక్షులుగా నియామకమైన కొమ్మిడి రాజేందర్ రెడ్డిని, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలిగా నియామకమైన మల్కా భాగ్యలక్ష్మి ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి తో కలిసి బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ సన్మానించారు...ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కందునూరి కుమార్, శేఖర్ మాస్టర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.