8 August, 2026 | 5:46 PM

Breaking News

తూప్రాన్‌ ఖో-ఖో క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి   •   పరమేశ్వర్ కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత   •   త్రుటిలో తప్పిన పెను ప్రమాదం   •   పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •  

డాక్టరేట్ ఇవ్వడమంటే రైతులకే గర్వకారణం

08-08-2026 03:18 PM

రాజేశ్వర్ రావును సన్మానించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): అమెరికా లోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ వారు   కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం రైతులకే గర్వకారణమని సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. డాక్టరేట్ పొందిన రాజేశ్వర్ రావు ను శనివారం చాడ వెంకటరెడ్డి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పట్టభద్రులైన రాజేశ్వర్ రావు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం,వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ద్వారా  రైతులు అదనపు ఆదాయం పొందేందుకు  ఆర్థికాభివృద్ధి చెందేందుకు ఆయన కృషి చేస్తున్నాడని,కరీంనగర్ లో పాలు అలాగే పాల ఉత్పత్తుల సేకరణలో,డెయిరీ అభివృద్ధిలో,మార్కెట్ పరిధిని విస్తరించడానికి,రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో కరీంనగర్ డెయిరీ నీ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిపిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని అన్నారు.

1971 లో 12 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించిన పాల డెయిరీ నేడు 3లక్షలకు పెంచడంలో రాజేశ్వర్ రావు కృషి,పట్టుదల ఎంతో ఉందని,అప్పటి నుండి ఎన్నో అవార్డులు అందుకున్నాడని, భవిష్యత్ లో రైతులకు మరింత సేవ చేస్తూ,మరెన్నో అవార్డులు పొందాలని వెంకటరెడ్డి ఆకాంక్షిస్తూ రాజేశ్వర్ రావు ను అభినందించారు. సన్మానించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ ఉన్నారు.