8 August, 2026 | 5:46 PM

Breaking News

తూప్రాన్‌ ఖో-ఖో క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి   •   పరమేశ్వర్ కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత   •   త్రుటిలో తప్పిన పెను ప్రమాదం   •   పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •  

ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులుగా పెద్దల్లి జంబులయ్య మాదిగ

08-08-2026 03:18 PM

మహబూబ్ నగర్ అర్బన్ : హైదరాబాద్ లో జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఫౌండర్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి కీలక పాత్ర పోషించిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పెద్దెల్లి జంబులయ్య  సేవలను గుర్తించి నేడు ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ మేడి పాపన్న  ఉత్తర్వులు జారీ చేశారు.  ఎమ్మార్పీఎస్ చేపట్టిన పలు ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మెట్టు అంజమ్మను రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

  నియమించబడిన పెద్దెల్లి జంబులయ్య, మెట్టు అంజమ్మ ఇకముందు కూడా మాదిగల, అభివృద్ధి,  ఔన్నత్యం, సంక్షేమ పథకాలు సాధన విషయంలో జాతీయ అధ్యక్షులు మెడి పాపన్న  ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని,ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ మాదిగల హక్కుల కోసం నిరంతరం పనిచేయాలని  కోరారు కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దొబ్బలి అంజన్న మాదిగ,  ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కాలే రమేష్, కాలే నరేందర్ తదితరులు పాల్గొన్నారు.