23-11-2025 03:54:37 PM
లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను బీసీ, ఎస్సీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని, ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఆలోచనలను బీసీ వర్గాల్లో తీసుకెళ్లి ముందుకు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా నాయకులు కర్ర లచ్చన్న, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మల్లేష్, బిసీ జిల్లా నాయకులు మధుసూదన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, మాజీ చుంచు చిన్నయ్య, బిసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.