23-11-2025 03:57:23 PM
లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఉత్కూర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎవరు ప్లెక్సీలు కట్టి ఇబ్బందులు పెట్టవద్దని అంబేద్కర్ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఉత్కూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న పలు ప్లెక్సీ లను తొలగించిన అనంతరం వారు మాట్లాడారు. కొందరు దురుద్దేశంతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కట్టి ఇబ్బందులు పెడుతున్నారని, అవి విరమించుకోవాలని కోరారు. అంబేద్కర్ అందరివారు, బడుగు బలహీన వర్గాల రాజ్యాంగ నిర్మాత అని అన్నారు.
కొందరు ఈ చౌరస్తాను వేరే పేరు పెట్టడానికి నామకరణం చేయడానికి ప్రణాళిక చేస్తుండడం అది మానుకోవాలని సూచించారు. ఎప్పటికీ ఊట్కూర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాగానే ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ముల్కల రాందాస్, జిల్లా కార్యదర్శి శనిగారపు లింగన్న, చుంచు రమేష్, చిప్పకుర్తి నారాయణ, వేముల ప్రేమ్ సాగర్, పిండం సత్తయ్య, కళ్ళపెళ్లి విక్రమ్, మడిపల్లి వెంకటేష్, దర్శనాల నవీన్ కుమార్, కత్తెరపాక దుర్గయ్య, చిలుముల నరసయ్య, గరిస రవీందర్ తదితరులు పాల్గొన్నారు.