మాజీ ఎమ్మెల్యే మర్రికి మతి భ్రమించింది
- పదేళ్లు నల్లమట్టి కోళ్లగొట్టి.. ఊర్లను వళ్ళకాడిలా మార్చిండు
రాజకీయ ఓనమాలు నేర్పినోడికే పంగనామాలు పెట్టిన ఘనత మర్రికే దక్కింది
తెల్లారితే ఏ పార్టీలో ఉంటావో గ్యారంటీ లేదు
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేతల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు
మాజీ ఎమ్మెల్యేమర్రి జనార్దన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కూచుకుళ్ల ఫైర్
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 3 ( విజయక్రాంతి ) పదేళ్లు అధికారాన్ని అనుభవించి అందిన కాడికి దోచుకొని అహంకారంతో ప్రజా సమస్యలను గాలికొదిలి ఘోరంగా ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి మతి భ్రమించిందని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృ హంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై ధ్వజమెత్తారు.
కనీస విలువలు విజ్ఞత లేకుండా అడ్డదారుల్లో సంపాదించిన ఆస్తిని కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి అనామకుడిగా వచ్చి ఇతరుల సహాయంతో రాజకీయ ఓనమాలు నేర్చుకొని తెలంగాణ ఉద్యమ గాలిలో గెలిచాడని అధికార పరపతితో నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని అడ్డ గోలుగా దోచుకున్నాడని ఆరోపించారు.
ప్రజాధనాన్ని లూటీ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తొత్తుగా మారి పాలన సాగించాడని తనను నమ్మి తన వెంటే తిరిగిన కార్యకర్తలకు సైతం డబ్బులు ఎగ్గొట్టారని ఆ రోపించారు. మహిళా సమాఖ్య భవనం ని ర్మాణం, ఆర్టీఓ కార్యాలయ నిర్మాణం పేరు తో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచేందుకు ప్రభుత్వ ధనాన్ని గంగలో కలిపారని ఆరోపించారు.
చెరువులో కుంటల్లో నల్లమట్టిని కొల్లగొట్టి కోట్ల రూపాయలకు పడగ లెత్తారని ప్రకృతి సంపాదను కూడా దోచుకుని గుట్టలను మింగేసాడని మండిపడ్డారు. ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కబ్జాలు చేసి కందనూలును వల్లకాడు గా మార్చారని ఆరోపించారు. నిరుపేద విద్యార్థులు చదివే జూనియర్ కళాశాల భవ న నిర్మాణానికి, జిల్లా పరిషత్ పాఠశాల స్థలానికి ఎసరు పెట్టాడని ఆరోపించారు.
రెం డోసారి తన సహకారం వల్లే గెలిచిన విషయాన్ని మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. మూడోసారి నాగం జనార్దన్ రెడ్డి సహకారం లేకుంటే డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదన్నారు. తన కుమారుడిని ప ప్పు అంటూ సంబోధించిన మర్రి జనార్దన్ రెడ్డికి ఆ పప్పు చేతిలోనే ఘోరంగా ఓటమి చెందిన నీవు సుద్ధ పప్పు నీవే అంటూ బదులిచ్చారు. ఒక తండ్రిగా స్థానిక ఎమ్మెల్సీగా తన సలహాలు సూచనలు తీసుకునే అధికారం తన కుమారుడికి ఉందన్నారు.
రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగతంగా కించపరిచేలా విలువలు లేకుం డా మాట్లాడటం సరికాదని సూచించారు. తన తండ్రి మాటను లెక్కచేయకుండా కొ డుకు మాటకు విలువ కూడా ఇవ్వకుండా అ హంకారంతో వ్యవహరించాడని కనీస అక్షర జ్ఞానం కూడా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మర్రికి సూచించారు.
రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులపై ధర్నా చేస్తే ఎవరికి ఇబ్బందులు లేవని అన్ని రాష్ట్రాల్లోనూ యూరియా సమస్య ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తాను త న కుటుంబం గత 40 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు రాజకీయంగా సేవలు అందిస్తోందని ఎక్కడ ఎవరిపైనా యజమాయిషి, అ హంకారాన్ని ప్రదర్శించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి పేరెందుకు కాంగ్రెస్ పెద్దల ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
అసలు తెల్లారితే ఏ పార్టీలో ఉంటావో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడని మతిభ్రమించి తనకిష్టం వ చ్చిన విధంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ ఎంపీపీ కోటయ్య, మాజీ కౌన్సిలర్లు సురేంద్ర, నిజాం, జక్క రాజ్ కుమార్ రెడ్డి తదితరులుఉన్నారు.






