04-09-2025 12:49:49 AM
యూరియా కోసం భిక్షాటన
అధికారుల కాళ్లు మొక్కుతున్న రైతులు
యూరియాను లీడర్లే దోచేస్తున్నారు
గోపాలపేట సెప్టెంబర్ 3 : రైతుల బాధలను పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాకొద్దని రైతన్నలు ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో బుధవారం మండలంలోని గోపాలపేట చెన్నూరు బుద్ధారం ఏదు ట్ల తాడిపర్తి చాకలి పల్లి తదితర గ్రామాల రైతన్నలు గోపాలపేట మండల కేంద్రంలో రోడ్డెక్కారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వెం టనే గద్దె దిగాలని మండిపడ్డారు.
మూడు నెలలుగా వస్తున్న రైతులకు యూరియా అం దించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఓ రైతు చీర కట్టుకొని రోడ్డుపై యూరియా కా వాలని భిక్షాటన చేస్తున్నాడు. సుమారుగా ప్రధాన రోడ్డుపై 200కు పైగా చుట్టుపక్కల గ్రామాల రైతులంతా రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతులం దరికీ యూరియా అందించకుంటే ఇక్కడే రై తులు పొర్లుదండాలు కూడా చేయాల్సి వ స్తుందని వాపోయారు.
అక్కడికి చేరుకున్న వ్యవసాయ అధికారులు పైనుండి యూరి యా కొరత ఉందని పంపించినంత అందజేస్తున్నామని అధికారులు సూచించారు. దీం తో రైతన్నలు ఒక్కసారిగా కోపగ్రస్తులై అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం సరఫరా చేసిన కొద్దిపాటి యూరియా కూ డా రైతన్నలకు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క రైతు కన్నా యూ రియా అందుతుందా అని నిలదీశారు.
రాత్రికి రాత్రి లీడర్లు దోచేస్తున్నారు
ప్రభుత్వం సరఫరా చేసిన యూరియా కాంగ్రెస్ లీడర్లు కాపుకాచుకొని అధికారులతో కుమ్మక్కై రాత్రికి రాత్రే దోచేస్తున్నారు. కాంగ్రెస్ లీడర్లే వ్యవసాయానికి ఆ యూనియన్ వాడుకుంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఓ ట్లు వేసి గెలిపించిన రైతన్నల పరిస్థితి ఏంటి అని భగ్గుమన్నారు. ఒక రైతుకు ఒక బస్తా కూడా యూరియా ముట్టడం లేదని అన్నా రు. ఎటువంటి బిల్లులు లేకుండా అధికారులు కుమ్మక్కై లీడర్ల చేతిలో పెడుతున్నారని నిలదీశారు.
యూరియా ఇక్కడి రైతులందరికీ ఇవ్వాలని ఓ రైతు వ్యవసాయ అధికారిని కాళ్లు మొక్కడం ఆలోచింపదగ్గ విషయమైం ది. యూరియా కూడా రైతన్నలకు అందజేయని ఈ పాలన ఎందుకని ప్రశ్నించారు. సు మారు మూడు గంటలపాటు ఎక్కడికక్కడే రాకపోకల నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఎంత నచ్చజెప్పినా వినేది లేదని మాకు యూరియా వచ్చేవరకు రోడ్డుపై నుంచి లేచే ది లేదని భీష్మంచి కూర్చున్నారు.
వ్యవసా య అధికారులు నచ్చజెప్పి వెంటనే ఉన్నాధికారులకు సమాచారం ఇచ్చి యూరియా వ చ్చే ఏర్పాటు చేస్తామని బుజ్జగించారు దీంతో రైతన్నలు నిరసనను విరమించారు.