11 August, 2026 | 6:47 PM

రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది

02-09-2025 06:18 PM

కుభీర్: కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని మండల రైతాంగానికి ముధోల్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మండలంలోని కస్ర, కస్ర తండా, వర్ని, సోనారి తదితర గ్రామాలలో దెబ్బతిన్న పంటలను ఆయన మండల నాయకులతో కలిసి పరిశీలించారు.

వ్యవసాయ శాఖ అధికారులు  ఈపాటికి ప్రాథమిక అంచనాలను తయారు చేశారని సర్వే నిర్వహించి పూర్తి రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బైంసా ఆత్మ చైర్మన్ సిద్ధంవార్ వివేకానంద, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బషీర్, పార్టీ సీనియర్ నాయకులు కొట్టే హనుమాన్లు, బంక బాబు, పార్డి (బి) నరేందర్, శంకర్ చంద్రే, నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.