11 August, 2026 | 7:56 PM

ఫలితాల్లో జిల్లా పేరును నిలబెట్టాలి

02-09-2025 06:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాలు నిర్మల్ జిల్లా పేరును ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విద్యాశాఖ నూతన అధికారి దర్శనం భోజన్నకు సూచించారు. నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీపై వచ్చిన ఆయన మంగళవారం శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందించారు జిల్లాలో విద్యాశాఖ పనితీరు మెరుగుపడేలా అందరూ కష్టపడి పని చేయాలని కలెక్టర్ డీఈఓ ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.