calender_icon.png 20 January, 2026 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే

20-01-2026 03:39:33 PM

మద్నూర్,(విజయక్రాంతి): మద్నూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ  పట్టణ అధ్యక్షులు కంచిన్‌వార్ హన్మాండ్లు ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జుక్కల్ మాజీ ఎమ్మెల్యే  హన్మంత్ షిండే   మంగళవారం మద్నూర్ లోని వారి నివాసానికి వెళ్లి హన్మాండ్లు ను పరామర్శించారు.

అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పాకల్ విజయ్, క్రిష్ణ పటేల్, పండిత్ రావు పటేల్, మాజీ సర్పంచ్ సురేష్, బి ఆర్ స్ కార్యకర్తలు వున్నారు.