calender_icon.png 18 November, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతారం పాండురంగ విఠలేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

18-11-2025 08:33:35 PM

మునిపల్లి (విజయక్రాంతి): మండల పరిధిలోని అంతారం జీవన్ముక్త పాండురంగ విఠలేశ్వర ఆలయ జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆందోల్ మాజీ ఎమ్మెల్యే స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఆయన వెంట మాజీ జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్, మాజీ ఎంపీపీ శైలజ శివశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశి కుమార్, మండల యూత్ అధ్యక్షుడు ఆనంద్, మాజీ సర్పంచులు శంకర్, రమేష్ శ్రీనివాస్, సిద్ధన్న పాటిల్, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు పరశురాం గౌడ్, నాయకులు కుదుబోదిన్, విట్టల్, బండారి పాండు, భాస్కర్, నవీన్,  అప్సర్ తదితరులు పాల్గొన్నారు.