calender_icon.png 18 November, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడి పశువుల సంరక్షణకు నివారణ చర్యలు

18-11-2025 08:35:48 PM

ఉచిత పాడి పశువుల వైద్య శిబిరం

డి.వి.ఏ.హెచ్.ఓ డాక్టర్ టి.ఆదిత్య వర్మ

గుమ్మడిదల: పాడి పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ సాధారణ పరీక్షలతో పాటు నట్టల మందు, పిడుదల మందు, చూడి, గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత వైద్య చికిత్స శిబిరం నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ న్యూల్యాండ్ సంస్థ ద్వారా మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు పోచమ్మ దేవాలయం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకు పశు వ్యాధుల చికిత్సను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ టి ఆదిత్య వర్మ మాట్లాడుతూ.. నోరులేని మూగజీవాలకు వ్యాధుల నివారణ కోసం న్యూల్యాండ్ పరిశ్రమ యాజమాన్యం సహకారంతో పశువులకు వ్యాధుల నిరోధక టీకాలతో పాటు పలు వ్యాధులకు వైద్యం చేశారు ఇట్టి ఉచిత వైద్య శిబిరాన్ని పశువుల యజమానులు సద్వినియోగం చేసుకొని పశువులన్నిటికీ చికిత్సలు చేయించుకోవాలని సూచించారు.

క్రమం తప్పకుండా డివార్మిన్ చేయడం ద్వారా పశువుల ఆరోగ్యం పాల ఉత్పాదకత పెరుగుతుందని వివరించారు. పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పశు సంరక్షక రైతులుఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. ప్రస్తుతం రైతులకు పచ్చి మేత విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారిని డాక్టర్ అరుణ,డాక్టర్ ఐ.చైతన్య, ఓఎస్ అశోక్, ఓఎస్ ప్రియా, సిబ్బంది వీరేశం రమేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.