calender_icon.png 18 November, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోన్ యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

18-11-2025 08:31:09 PM

హనుమకొండ (విజయక్రాంతి): తీసుకున్న అప్పు తీర్చలేక, లోన్ యాప్ వాళ్ళ బాధలు భరించలేక హనుమకొండ అమరావతి నగర్ టీవీ టవర్ కాలనీకి, చెందిన గోలి నవీన్ రెడ్డి అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైనాకు చెందిన యాప్లో లోన్ తీసుకొని చెల్లించకపోవడంతో, అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్లో పోస్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్, వేధింపులు తట్టుకోలేక సమీపంలో ఉన్న వడ్డేపల్లి-దేవన్నపేట మధ్యలోని బావిలో దూకి బలవన్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.