అనారోగ్యంతో మాజీ ఎంపీటీసీ మృతి
అంత్యక్రియల్లో పాల్గొనిపాడే మోసిన చాడ
చిగురుమామిడి, జూన్ 12(విజయక్రాంతి): చిగురుమామిడి మం డలం రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ అనారోగ్యంతో గురువా రం మృతి చెందారు. చాడ శోభ అనారోగ్యంతో కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెం దగా స్వగ్రామం రేకొండలో అంత్యక్రియలు నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొని ఆమె మృతదేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులు, నాయకులతో కలిసి పాడే మోసారు. సిపిఐ మండల నాయకత్వం శోభ మృతదేహంపై రెడ్ క్లాత్,పార్టీ పతాకం కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ చాడ శోభ మృతి పార్టీకి, ఆమె కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. మంచి మనసున్న వ్యక్తి అని, గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునే మనస్తత్వం గలదని, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా నాయకునిగా పనిచేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ ప్రజలకు,పేదలకు అండగా నిలిచిందన్నారు.
2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా, మొక్కవోని ధైర్యంతో 2020లో జరిగిన ఎం పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి గ్రామ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆమె మృతి ప ట్ల సిపిఐ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ శోబా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని వెంకటరెడ్డి తెలిపారు.
నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నవారిలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వా మి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, బోయిని అ శోక్, గూడెం లక్ష్మి,కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కొయ్యడ సృజన్ కుమార్, కరీంనగర్,సిద్దిపేట జిల్లాల సీపీఐ కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ,అందె చిన్నస్వామి,
కాంతాల శ్రీనివాస్ రెడ్డి,బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్,మావురపు రాజు తేరాల సత్యనారాయణ,పైడిపల్లి రాజు,న్యాలపట్ల రా జు, బోనగిరి మహేందర్,యెడల వనేష్,కొమ్ముల భాస్కర్ ,జేరిపోతుల జనార్ధన్,కొయ్యడ కొమురయ్య, మాజీ మండల కార్యదర్శి ఎనగందుల రాజయ్య,మాజీ సర్పంచ్ లు గోలి బాపురెడ్డి, కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య,మాజీ ఎంపీటీసీ పరకాల కొండయ్య, రాజేశ్వర్ రెడ్డి తో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు గ్రామ ప్రజలుపాల్గొన్నారు






