calender_icon.png 17 June, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు నిలువ నీడ

13-06-2025 02:16:45 AM

పుట్టినరోజున డాక్టర్ వివేక్  దాతృత్వం 

మహబూబాబాద్, జూన్ 12 (విజయ క్రాంతి): చాలామంది తమ జన్మదిన వేడుకలను హంగు ఆర్భాటం మధ్య జరుపుకోవడం చూస్తుంటాం. అందుకు భిన్నంగా డిఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి లక్షన్నర వ్యయంతో ఇంటిని నిర్మించి నిలువ నీడ కల్పించారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం హూణ్య తండాలో నిరుపేద భూక్య దేవ అనే వ్యక్తి నిలువ నీడ లేక పడుతున్న సంఘటన చూసి చలించిపోయారు. వెంటనే ఇంటి నిర్మాణానికి అవసరమైన లక్షన్నర రూపాయలను అందజేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ పేద కుటుంబానికి నిలువ నీడ కల్పించడం తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని చెప్పారు.

స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. చక్కగా చదువుకుని ఉజ్వల భవిష్యత్తు అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భూక్య శ్రీకాంత్, మాలోతు శాంతి కుమార్, కేలోత్ సాయికుమార్, సూర్య ప్రకాష్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు భీమా నాయక్, కిసాన్ పరివార్ ప్రతినిధులు విష్ణు నాయక్, సోమన్న తదితరులు పాల్గొన్నారు,