28 August, 2026 | 1:57 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

రేబిస్ టీకాలు వేయించాలి

07-07-2026 12:14 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, జూలై 6 (విజయక్రాంతి) : జిల్లాలో జంతు ప్రేమికులు కుక్కలు, వాటి పిల్లలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమానికి జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి (డీవీఏహెచ్‌ఓ) డాక్టర్ యాకూబ్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణలతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, రైతులు, పశుపోషకులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలన్నారు. అనారోగ్యంతో ఉన్న జంతువులను వేరుగా ఉంచడం, పాలు, మాంసాన్ని పరిశుభ్రంగా నిర్వహించడం, చనిపోయిన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో పారవేయడం, అనుమానాస్పద లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని సూచించారు.

రేబిస్ వ్యాధి 100 శాతం నివారించ దగినదని, కుక్కలు, పిల్లలకు క్రమం తప్పకుండా రేబిస్ టీకాలు వేయించడం ద్వారా కుటుంబాలు, సమాజాన్ని సురక్షితంగా ఉంచవచ్చన్నారు. ఆరోగ్యకరమైన జంతువులు, ఆరోగ్యకరమైన మనుషులు, ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంతో అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు. శిబిరంలో 32 పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ ను పశు వైద్యులు వేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ శాంతి రేఖ, లైవ్ స్టాక్ అసిస్టెంట్ సోనియా, సహాయకులు గోవర్ధన్, గోపాలమిత్ర వేణు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.