12 June, 2026 | 1:16 AM

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో ప్రతిభ చాటిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ

12-06-2026 12:00 AM

కోరుట్ల, జూన్ 11 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్లలో మే 13న జరిగిన ఇం టర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్ష  రాసిన  తిప్పిరి తిరుపతి  తెలుగు పరీక్షలో 72 మా ర్కులు సాధించిన దేవ్‌జీ ఇంటర్మీడియట్‌లో మొత్తం 614 మార్కులు సాధించినట్టు తిరుపతి అలియాస్ దేవుజి తెలిపారు. ఉద్య మాన్ని వీడి జీవన స్రవంతిలో కలిసి పేద ప్రజలకు న్యాయం చేయడమే తన లక్ష్యంగా న్యాయవిద్యను అభ్యసించాలని దృఢ సంకల్పంతో లా సెట్ పరీక్ష రాయగా ఈనెల 4న లా సెట్‌లో 349 ర్యాంకు సాధించారు. పట్టుదల ఉంటే కానిది లేదని పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెన్నంటే ఉంటానని తెలిపారు.