వైరా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్ లాల్ కన్నుమూత
ఖమ్మం,(విజయక్రాంతి): వైరా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్ లాల్ మంగళవారం మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం ఖమ్మంలోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురైన మదన్ లాల్ ను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మదన్ లాల్ ఇవాళ ఉదయం గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబీకులు వెల్లడించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. పలు రాజకీయ నాయుకులు మదన్ లాల్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ప్రస్తుతం బిఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. పార్టీ నేత మృతిపై బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.






