27-05-2025 02:56:04 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లపై భూభారతి, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు.