05-12-2024 10:11:11 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): అరెస్ట్‌లు చేస్తే బెదిరేది, బయపడేది లేదని,ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్‌రావు అక్రమ అరెస్ట్ చేయడంతో ఆయనను చూడాటానికి గురువారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను టిఎస్‌పీఎస్‌సీ సభ్యురాలు సుమిత్రానంద్‌ను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో మోకిలా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్‌రావును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఇదే ప్రజాపాలన.. అదెక్కడి ద్వందనీతి అని ప్రశ్నించారు. ఆయనను పరామర్శించడానికి బయల్దేరిన తమను ఎందుకు ప్రభుత్వం అరెస్ట్ చేయించిందో తెలుపాలన్నారు.ప్రజల తరుపున పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌నాయకులను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడితే ఈ మాత్రం బెదిరిపోమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హమీలు అమలు చేసే వరకు ప్రజాక్షేత్రంలో నీలదీస్తామన్నారు.