calender_icon.png 11 August, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడ బిడ్డలకు అండగా కాంగ్రెస్

05-12-2024 10:16:20 PM

మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్‌ఆర్

మంచిర్యాల,(విజయక్రాంతి): ఆడ బిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ప్రజా ప్రభుత్వంలో సకల జనుల సంబురం’ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడ బిడ్డలకు తొలి ప్రాధాన్యతనిస్తూ ఆడ పడుచులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఎవరిపై ఆధారపడకుండా వారికి అవసరమైన చోటుకు కేవలం ఆధార్ కార్డుతో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారన్నారు. నష్టాలలో ఉన్న ఆర్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వంతో లాభాల బాట పట్టిందన్నారు. అనంతరం పలువురు ప్రయాణికులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్ధన్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.