05-12-2024 10:06:53 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): హైదారాబాద్‌లో ఎమ్మెల్సీ కొదండారంను గురువారం కామారెడ్డి టీజీటిఎప్ ప్రతినిధులు కలిశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరికి స్థానిక జిల్లాలో లోకల్ క్యాడర్‌లో రీ అలోకేషన్ ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.317 జీవోపై ప్రభుత్వం వెలువర్చిన 243,243 జీవోల ద్వారా ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగే పరిస్థితులు లేవని, స్పౌజు కేటగిరి,మెడికల్, తదితర కేటగీరల్లో లోకల్ క్యాడర్ మార్పు కోసం వేచి చూస్తున్నా ఉపాధ్యాయులందరికి బదిలీ అవకాశం కల్పించేలా ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వచ్చేలా చూడాలన్నారు.