21-01-2026 11:56:52 AM
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ముందు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మంత్రి వివేక్ వెంకటస్వామికి బిగ్ షాక్ తగిలింది. చెన్నూర్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ కె చెందిన 15 మంది రెబల్ సర్పంచ్ లు, 10 మంది మాజీ ఎంపీటీసీలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi)లో చేరుతున్నట్లు సమాచారం. ఈ సందర్బంగా రాజిరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో అవమానాన్ని భరించలేకపోతున్నాని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో వెయ్యి మందితో కలిసి గులాబీ కండువా కప్పుకుంటానని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎగరవేస్తామని దిమ్మ వ్యక్తం చేశారు.