21-01-2026 11:22:53 AM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను పాటించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఘట్ కేసర్ లో బుధవారం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులను అధిష్టానం గుర్తించి తగిన పదవులు ఇస్తుందన్నారు. పార్టీ విషయాలలో నాయకులు, కార్యకర్తల నిర్ణయం మేరకు కార్యక్రమాలు నిర్వహించాలని ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి పార్టీని వాడుకోకూడదని, అధిష్టానం ఆదేశాలను దిక్కరించేవారిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.