క్యాతన్‌పల్లి ఎన్ని క సవ్యంగా నిర్వహించాలి
- ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదు
- చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
- జైలు నుంచి విడుదల
ఆదిలాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ము న్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి గౌరవించడం లేద ని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అ న్నారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికలను మరోసారి సవ్యంగా నిర్వహించాలని ఆయన డిమాం డ్ చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవ కేసులో ఆదిలా బాద్ జిల్లా జైలులో గత 15 రోజులుగా రిమాం డ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో బుధవారం ఉదయం జిల్లా ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు రాజిరెడ్డి, అని ల్, లక్ష్మీ కాంత్ విడుదలయ్యారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి జోగు రామన్న తో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు భారీ గా చేరుకుని స్వాగతం పలికారు. అనంతరం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. క్యా తన్‌పల్లి చైర్మన్ ఎన్నికల వేళ మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా తనను అడ్డుకున్నారని.. కానీ మంత్రి వివేక్‌ను ఎలా పంపిస్తారని పోలీసులను అడిగితే తమపైనే లాఠీ ఛార్జి చేశారని చెప్పారు. 22 మంది మీద అక్రమంగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కు కేవలం 7 స్థానాలు వస్తే మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ నుండి మొదలుకుని తహసిల్దార్ వరకు అధి కారులు, పోలీసులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా విశాఖ ఇండస్ట్రీ ఉద్యోగులు గా పని చేస్తున్నారని ఆరోపించారు. 15 రోజుల పాటు జైలు లోపల ఇబ్బంది పెట్టారని చెప్పారు. తనకు బెయిల్ రాకుండా ప్రభుత్వం అడ్డుకుందన్నారు. హోళి పండగ రోజు ఇంట్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పదేళ్ల ప్రభుత్వ పాలనలో ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు దిగలేదని స్పష్టం చేశారు.




