1 July, 2026 | 2:18 AM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

01-07-2026 01:20 AM

జహీరాబాద్, జూన్ 30 : గ్రామాలను అభివృద్ధి పనుల్లో నడిపించేందుకు నాణ్యమైన పనులు చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు. మంగళవారం నాడు కోహిర్ మండలం కొత్తూరు పట్టిదిగ్వాల్ గ్రామంలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ఝరాసంగం మండలం పొట్టుపల్లి గ్రామంలో 4 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని, నాణ్యమైన పనులు చేసేందుకు ఆయా గ్రామాల ప్రజలు సహకారాలు అందించాలని ఆయన తెలిపారు.

కొత్తూరు డి గ్రామంలో 9 లక్షల రూపాయలతో సిసి రోడ్లు ములుగు కాలువలు నిర్మాణానికి నిధులు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.  అంగన్వాడి విధులకు గైరాజరైన అంగన్వాడి టీచర్ విషయమై సిడిపిఓ తో మాట్లాడి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల మొగులయ్య, సిద్దన్న పటేల్, నరసింహులు, సునీల్, జాన్సన్, శ్రీకాంత్,  బసవరాజ్ పటేల్, మొగులప్ప, కోహిర్ మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు నర్సింలు, గ్రామ సర్పంచ్ మాణిక్ ప్రభు,  ఉప సర్పంచ్ ఆనంద్, బోయిని నర్సింహులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.