అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
కోదాడ: మండలంలోని గుడిబండ గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ నిధులు రూ. 8 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2 లక్షలు, ఎండబ్ల్యూసీడీ నిధులు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.12 లక్షలతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం(Telangana State Formation Day) సందర్భంగా గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. స్పెషల్ ఆఫీసర్ పారిజాతం, పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి అవినాష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు రఫీ, ఇర్లా నర్సిరెడ్డి, రామకృష్ణారెడ్డి, సూరయ్య, రాజారావు, శ్రీను, ప్రసాద్ రెడ్డి, కొండల్, హసన్ అలీ, మౌలానా, నసీమా బేగం, హైమావతి పాల్గొన్నారు.






