13-09-2025 03:26:07 AM
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మోండా డివిజన్ లో పర్యటించి కోటి 34 లక్షల రూపాయల వ్యయంతో మూడు చోట్ల చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రా రంభించారు. ముందుగా బండిమెట్ లో 39.60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, జైన్ టెంపుల్ సమీ పంలో 49.50 లక్షల రూపాయల వ్యయం తో చేపట్టనున్న సీసీ రోడ్డు, రాజేశ్వరి థియేటర్ వెనుక 45 లక్షల రూపాయల వ్యయం తో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
ముందుగా స్థానికంగా ఉన్న పలువురు వ్యాపారులు, బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కు శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో ఈ ప్రాంతం లో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగిం దని తెలిపారు. ప్రధానంగా మోండా డివిజన్ లోని బండి మెట్ ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించామన్నారు.
ఈ కార్యక్ర మంలో డాకు నాయక్, కార్పొరేటర్ దీపికా, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, మహేష్, వాటర్ వరక్స్ ఆశిష్, శానిటేషన్ వెంకటేష్, ఎలెక్ట్రికల్ ఏఈ వరలక్ష్మి, బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, రాములు, ఓదెల సత్యనారాయణ, జయరాజ్, మహేష్ యాదవ్, మహేందర్, హన్మంతరావు తదితరులు ఉన్నారు.