13-09-2025 03:24:19 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమా లకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వందలాదిమంది శుక్రవారం భిక్కనూరులో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,బిక్కనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, లింబాద్రి, బల్యాల రేఖ, తదితరులు పాల్గొన్నారు.