calender_icon.png 6 February, 2026 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శ్రీ అలివేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం

06-02-2026 05:21:19 PM

పాల్గొన్న ఎక్స్ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

షాద్‌నగర్,(విజయక్రాంతి): కేశంపేట మండల కేంద్రంలోని శ్రీ దవలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం  అంగరంగ వైభవంగా శ్రీ అలవేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి  కళ్యాణ మహోత్సవంలో కేశంపేట మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశంపేట సర్పంచ్ బొజ్జం సంతోష శ్రీశైలం, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విశాల దంపతులను స్వామి వారి ఆశీర్వచనాలు  మరియు శాలువాతో సత్కరించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు, భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.