17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మేడారంలో నలుగురు భక్తుల మృతి

30-01-2026 02:03 AM

ఆరుగురికి తీవ్ర గాయాలు

ములుగు/మేడారం, జనవరి 29 (విజయక్రాంతి): మేడారం జాతరలో గురువారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెంద గా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతర ప్రాంగణంలో అస్వస్థతకు గురైన భక్తులను ప్రధాన మెడికల్ క్యాంపునకు తరలించే క్రమంలో నలుగురు మృతి చెందిన ట్లు వైద్యాధికారులు వెల్లడించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జగన్నగూ డెం గ్రామానికి చెందిన సిద్ధగోని శంకర్‌గౌడ్ (50) జనవరి 28న రాత్రి 8.40 గంటలకు మృతి చెందారు.

మద్యం అతిగా సేవించడం తో హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన పల్లెపు రాజు (40), పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గ్రామానికి చెందిన రవీందర్ సింగ్ టాగో ర్ (41) మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా ఐందారం గ్రామా నికి చెందిన రేవల్లి సుగుణ (60) గురువా రం జంపన్న వాగు నుంచి కుటుంబ సభ్యులతో వస్తుండగా.. చెత్త సేకరించే ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో సుగుణ మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.