calender_icon.png 30 January, 2026 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు పోలీసులు అండగా ఉండాలి

30-01-2026 02:05:05 AM

బ్లాక్‌మెయిల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

‘ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్’ మంచి నిర్ణయం 

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): మహిళల భయాలు ఆసరాగా చేసు కుని కొందరు ఆకతాయిలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసెడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బాధిత మహిళలకు పోలీసు లు అండగా ఉండాలని చెప్పారు.  ఈ మేరకు ఇంటి దగ్గరే ఎఫ్‌ఐఆర్ నమోదు నిర్ణయా న్ని స్వాగతిస్తున్నామని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ తీసుకున్న నిర్ణయం చాలా మంచిందన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ అధికారి చారుసిన్హా చేసిన ప్రకటన మహిళలు, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆయుధం లాంటిందన్నారు.

కొందరు వ్యక్తులు ఆడపిల్లలతో ఫోటోలు తీసుకుని.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఇలాంటి విషయాల్లో ఆడపిల్ల తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదును పోలీసులు బహిర్గతం చేయవద్దని జగ్గారెడ్డి కోరారు. నాయకులు, అధికారుల వ్యక్తిగత సంబంధాల వార్తలు కూడా మీడియాలో వేయకుండా చూడాలని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలన్నారు. అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలకు పోలీసులు భరోసాగా ఉండాలని ఆయన కోరారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరైనా  మోసం చేయాలని ఆలోచన వస్తేనే భయం కలిగేలా పోలీసు చర్యలు ఉండాలని చెప్పారు.