30-01-2026 02:03:04 AM
రాష్ట్రంలో బీజేపీ ప్రభావం లేదు
ఎన్నికల్లో పోటీ చేస్తాం
తెలంగాణ రాజకీయ కూటమి నేతలు
హైదరాబాద్(కవాడిగూడ), జనవరి 29 (విజయక్రాంతి): బహుజనుల రాజ్యాధికారం ధ్యేయంగా తెలంగాణ రాజకీయ కూ టమి అడుగులు వేస్తోంది. కవాడిగూడలోని ఆర్‌ఎల్‌డీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి ముఖ్య నేతలు పాల్గొని, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు గుప్పించారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అవినీతిలో కూరుకుపోయాయన్నారు. బీజేపీ రాష్ట్రంలో ప్రభావం చూపలేక చతికిలబడిందని కూటమి సెక్రటరీ జనరల్ కపిలవాయి దిలీ ప్ కుమార్ విమర్శించారు. ‘బహుజనులకే రాజ్యాధికారం -మేమెంతో మాకంత’ అనే నినాదంతో రాబోయే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఈ కూటమి ఉమ్మడిగా పోటీ చేయనున్నామని ప్రకటించారు.
అవినీతికి నిలయంగా మారిన సింగ రేణి సంస్థను మూసివేయాలని లేదా దాని వాటాలో భారీ మార్పులు చేయాలని డి మాండ్ చేశారు. కార్మికులకు 51%, రాష్ట్ర ప్రభుత్వానికి 25%, కేంద్రానికి 24% వాటా ఇచ్చేలా కొత్త విధానం రావాలని సూచించారు. తెలంగాణ సాధించుకున్న లక్ష్యాలు 85% ఉన్న బహుజనులకు దక్కకుండా, 15% ఉన్న అగ్రవర్ణాలకే దక్కాయని కూట మి అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమా ర్ ఆవేదన వ్యక్తం చేశారు. 28 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, అరకొర ఉద్యోగాలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కూటమి వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల ప్రదీప్ గౌడ్, బహుజన రాజ్యం పార్టీ నేత రమావత్ లాలూనాయక్, డేవిడ్ ఆం డ్రూ (క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ), డాక్టర్ ఈడ శేషగిరిరావు (ఆధార్ పార్టీ) పాల్గొన్నారు.