calender_icon.png 23 May, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

15-05-2025 12:00:00 AM

ఎల్బీనగర్, మే 14 : అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘ టన బుధవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలి తండ్రి  కట్టా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు... ఖమ్మం జిల్లా కేంద్రంలోని నాయుడుపేటకు చెందిన జాస్మిన్ ను రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ - శివపురికాలనీకి చెంది న రాజశేఖర్‌తో 2021లో వివా హం జరిగింది.

పెండ్లి సమయం లో రూ.25 లక్షల కట్నం, 20 తులాల బంగారాన్ని అందజేశారు. అయితే, వివా హం జరిగిన ఆరు నెలల తర్వాత రాజశేఖర్ అతడి కుటుంబ సభ్యులు జాస్మిన్ను అదనపు కట్నం కోసం వేధించి, పుట్టింటికి పంపారు. ఈ విషయంలో ఖమ్మంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.

అయి నప్పటికీ రాజశేఖర్ అతని కుటు ంబ సభ్యులు అదనపు కట్నం కోసం జాస్మిన్ను వేధిస్తూనే ఉన్నా రు. భరించలేని వేధింపుల కారణంగా జాస్మిన్ బుధవారం ఎల్బీ నగర్ లోని తమ ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. సమాచారం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధు వులు ఎల్బీనగర్‌కు చేరుకుని, జాస్మిన్ ఆత్మహత్యపై విచారించారు.

అదనపు కట్నం వేధింపులు భరించలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.