02-11-2025 09:43:57 AM
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ కారు భీభత్సం సృష్టించింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీనగర్ చెరువు కట్టపై థార్ కారు అతివేగంగా దుసుకెళ్లి ఒక బైక్ ను ఢీకొట్టిన సంఘటన వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువతి చెరువులో పడి మృతి చెందింది. బైక్ ను ఢీకొట్టిన అనంతరం డివైడర్ ను కూడా ఢీకొనడంతో థార్ వాహనంలో ఉన్న ముగ్గరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు వెంటనే స్థానిక భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. థార్ కారులో ఉన్న యువకులు మధ్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.