23-11-2025 09:12:59 AM
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోట చేసుకుంది. కోటబొమ్మాళి మండలంలోని ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తరం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులని, మృతులు భోరోసింగ్(60), విజయ్ సింగ్ తోమర్(65), ఉషీర్ సింగ్(62), సంతోషిబాయి(62)లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చారని, పూరి క్షేత్రాన్ని దర్శించుకుని, శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.