calender_icon.png 22 February, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి నాట్యమండలి చైర్మన్ బుడితి కోటేశ్వర్ రావుకు బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు

22-02-2026 03:30:20 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): గ్లోబల్ ఇండి ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా అసోసియేషన్ దాశరథి థియేటర్ వారు నిర్వహించిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా జాతీయ స్థాయిలో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డును ఘట్ కేసర్ సరస్వతి నాట్యమండలి చైర్మన్ బుడితి కోటేశ్వర్ రావు పలువురు సినిమా డైరెక్టర్ల చేతుల మీదు అందుకున్నారు. ఘట్ కేసర్ పట్టణానికి చెందిన బుడితి కోటేశ్వర్ రావు సరస్వతీ నాట్య మండి స్థాపించి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రజలను చైతన్యం చేసే విధంగా లఘు చిత్రాలను రచయితగా, డైరెక్టర్, నటుడిగా ఓటుకు నోటు, నీదేం కులంరా లఘు చిత్రాలు జాతీయ స్థాయి ఉత్తమ లఘు చిత్రాలుగా ఎంపిక కావడంతో

ఈ మేరకు బెస్ట్ షార్ట్ ఫిలీం అవార్డును నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ సినిమా డైరెక్టర్లు రేలంగి నరసింహా రావు, చంద్రమోహన్, వి.ఎన్. ఆదిత్య, వన్యమ్ రెడ్డి రాజా, ఎం.వి. రఘు, శ్రీనివాస్, యాంకర్ ఎస్.వి. స్వామినాయుడు, ఎస్. వినయ్ కుమార్ ల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ మేరకు ఆవార్డు ఫంక్షన్ లో దళిత సాహిత్య చేత మాస్టర్ జి. శ్రీవిద్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దాసారపు శ్రీనివాస్, జీవనది ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఇంటి లక్ష్మీలు కోటేశ్వర్ రావును అభినందించారు. ఈ మేరకు కోటేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రేమకు సాక్షి మైసమ్మ తల్లి అనే చలన చిత్రాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. ఈ అవార్డు అందించిన సంస్థలకు, పెద్దలకు, డైరెక్టర్లకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.