calender_icon.png 22 February, 2026 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారంపల్లిలో చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం

22-02-2026 03:33:35 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య నర్సయ్య మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సిరిసిల్లకు చెందిన శిరీష మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ సహకారంతో, ప్రముఖ చిల్డ్రన్ డాక్టర్ రాకేష్ చిన్నారులకు వైద్య సేవలు అందించారు. గ్రామంలోని పలువురు చిన్నారులకు ఓపీ సేవలు అందించి, అవసరమైన మందులను హాస్పిటల్ యాజమాన్యం ఉచితంగా పంపిణీ చేసింది. గ్రామంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.