calender_icon.png 18 July, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిభట్ల వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

18-07-2025 08:35:00 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల(Adibatla) వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై(Outer Ring Road) వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతులను మాలోతు చందూలాల్ (29), గుగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు (40)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.