18-07-2025 09:06:20 AM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి పరిధిలో కల్తీపాల(Adulterated Milk) తయారీ కేంద్రంపై అధికారులు దాడి చేశారు. పర్వాతాపూర్ లో కల్తీపాలు తయారీ స్థావరంపై ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తో కల్తీ పాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. 110 లీటర్ల కల్తీ పాలు, 1.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 19 గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, 50 పాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కల్తీ పాలు తయారు చేస్తున్న గంగులపూడి మరళీ కృష్ణారెడ్డి(50) అరెస్ట్ చేశారు.