calender_icon.png 18 July, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు రోజులు భారీ వానలు

18-07-2025 01:12:58 AM

ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావవరణ శాఖ

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంట కు 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు అక్కడక్కడ వీచే అవకా శముందని పేర్కొన్నది.

శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమ కొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.