మొదలైన నాలుగు లైన్ల పనులు
కరీంనగర్, జూన్ 19 (విజయక్రాంతి): హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిలో కొత్తపల్లి (రాజీవ్ రహదారి) ప్రస్తుతం రెడు వరుసల రహదారి ఉండగా నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమైనాయు. ఈ రహదారి విస్తరణకు అనేకసార్లు కేంద్రం వద్ద ప్రతిపాదనలు పెట్టినా.. స్పందించకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చింది.
మొదటి దశలో భాగంగా రహదారి అభివృద్ధికి రూ.77.20కోట్లు మంజూరు చేసింది. కొత్తపల్లి-హుస్నాబాద్-జనగాం నేషనల్ హైవే అభివృద్ధిపరచాలనే డిమాండ్ గత మూడేళ్లుగా ఉంది. కరీంనగర్-హుస్నాబాద్-జనగాం మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, సూర్యాపేట, ఏపీలోని విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లవచ్చు.
కరీంనగర్ వైపు మంచిర్యాల, గోదావరిఖని, జగిత్యాల ప్రాంతాలకు వాహనాల రాకపోకలు ఈ రహదారిపై సాగుతుంటాయి. ఈ రహదారిని భారత్మాల పథకం కింద నేషనల్ హైవే అభివృద్ధికి మూడేళ్ల క్రితం ప్రతిపాదించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో రాష్ట్ర రహదారిగా అభివృద్ధి పరుస్తామని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చి నిధుల మంజూరు చేయించారు.
హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం కోసం ప్ర భుత్వం ప్యాకేజీ 1,2 కింద 163.20 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నుండి సందరగిరి 10 కిమీ రోడ్డు విస్తరణకు ప్యాకేజీ -1 కింద 86 కోట్లు మంజూరు చేసింది.. సుదరగిరి నుండి హుస్నాబాద్ కి ప్యాకేజీ 2 కింద 77.20 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ పోల్స్ తొలగించి వాటి స్థానంలో విద్యుత్ టావర్స్ నిర్మాణం పనులు ప్రారంభమైనయి. రహదారి విస్తరణలో భాగంగా కల్వర్థుల పనులు, కొత్త రోడ్డు పనులు ప్రారంభమైనయి.






