calender_icon.png 22 October, 2024 | 9:14 PM

2023 - 2024లో 4.7 కోట్ల ఉద్యోగాలు

10-07-2024 05:29:26 AM

  • 27 రంగాల్లో 64.33 కోట్ల మందికి ఉపాధి 
  • ఆర్బీఐ తాజా గణాంకాలు

ముంబై, జూలై 9:  దేశంలో 2023 ఆర్థిక సంవత్సరంలో 4.7 కోట్ల ఉద్యోగాలు జతఅయ్యాయని, మొత్తం ఆర్థిక వ్యవస్థలోని 27 రంగాల్లో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య 64.33 కోట్లకు చేరిందని రిజర్వ్‌బ్యాంక్ తాజా గణాంకాల్లో వెల్లడించింది. 2023 మార్చి చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 59.67 కోట్లుగా నమోదైనట్టు తెలిపింది. 2023 ఉపాధి కల్పన వార్షిక వృద్ధి 6 శాతంకాగా, అంతక్రితం ఏడాది 3.2 శాతమని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే వ్యవ సాయం, అడవులు, మత్స్యవేట రంగం లో 25.3 కోట్ల మంది ఉపాధి పొందుతుండగా, నిర్మాణం, వ్యాపారం, రవాణా, స్టోరేజి రంగాలు సైతం భారీగా ఉపాధి కల్పిస్తున్న ట్టు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.