20-06-2025 12:32:31 AM
యాదాద్రి భువనగిరి జూన్ 19 ( విజయ క్రాంతి ): ఏఐసీసీ అగ్రనేత పార్లమెంటు పుత్పక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆసుపత్రి రోగులకు వృద్ధులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూరపాటి వెంకటేష్, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి పి ప్రమోద్ కుమార్, పిసిసి డెలిగేట్ మాజీ నెంబర్ తంగేళ్లపల్లి రవికుమార్, సేవాదళ్ రాష్ట్ర నాయకులు పిట్టల బాలరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ పార్టీ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు వెంకట్, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, బెండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు