9 May, 2026 | 3:35 AM

ప్రజావాణికి 424 దరఖాస్తులు

11-12-2024 12:17 AM

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 424 దరఖాస్తులు అందినట్లు  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.చిన్నారెడ్డి, ప్రజా పాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ప్రజావాణి వెల్లడించారు. మంగళవారం వారు ప్రజల నుంచి దరఖా స్తులు స్వీకరించి వివరాలు వెల్లడించారు. దరఖాస్తుల్లో పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని సమస్యలపై 108, మైనార్టీ సంక్షేమశాఖ 100, రెవెన్యూశాఖ పరమైన సమస్యలు 65, విద్యుత్‌శాఖ 57,  పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ 13, ప్రవాసీ ప్రజావాణికి ఐదు దరఖాస్తులతో పాటు ఇతర శాఖలకు సంబంధించి 76  దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు.