13 August, 2026 | 4:01 AM

వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

13-08-2026 12:37 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,ఆగస్టు12 (విజయ క్రాంతి): కెరమెరి మండలం ధనోరా గొండుగూడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మి (4) చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సమీపంలోని వాగులో పడిపోయింది.చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చేపట్టారు.

వాగులో చిన్నారి ఆచూ కీ లభించడంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వై ద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై ఎస్త్స్ర శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.తల్లిదండ్రులు చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.