నాదల్ నిష్క్రమణ
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
ఎర్రమట్టి కోటను కొన్నేళ్ల పాటు శాసించిన వీరుడి పోరాటం తొలి రౌండ్‌కే పరిమితమైంది. తనకు అచ్చొచ్చిన క్లే కోర్టులో 14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన ధీరుడు శక్తికి మించి పోరాడినప్పటికి ప్రత్యర్థి దెబ్బకు తలవంచాడు. క్లే కోర్టు రారాజు అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రాఫెల్ నాదల్ తాజా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఓటమి పాలయ్యాడు. జర్మన్ స్టార్ జ్వెరెవ్ చేతిలో ఓడిన నాదల్ బాధాతప్త హృదయంతో టోర్నీకి వీడ్కోలు పలికాడు..!
పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. మట్టి కోర్టుపై 14 సార్లు చాంపియన్‌గా నిలిచిన నాదల్ తొలి రౌండ్‌కే పరిమితమయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో నాదల్ 3 6 (5 3 ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. 3 గంటల 5 నిమిషాల పాటు జరిగిన పోరులో నాదల్ తన మునుపటి జోరును చూపలేకపోయాడు. తొలి సెట్‌ను జ్వెరెవ్ 6 సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో ఫుంజుకున్న నాదల్.. జ్వెరెవ్‌ను తీవ్రంగా ప్రతిఘటించాడు.
దీంతో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో జ్వెరెవ్ స్పష్టమైన ఆధిక్యం చూపి రెండో సెట్‌ను గెలుచుకున్నాడు.మూడో సెట్‌లో ఏమాత్రం ప్రభావం చూపని నాదల్ 3 జ్వెరెవ్‌కు సెట్‌ను కోల్పోయి తన ఓటమిని అంగీకరించాడు. ఇక మ్యాచ్‌లో జ్వెరెవ్ 8 ఏస్‌లు సందించగా.. నాదల్ రెండు మాత్రమే సందించాడు. జ్వెరెవ్ 18 బ్రేక్ పాయింట్లు సాధించగా.. నాదల్ 11కే పరిమితమయ్యాడు. ఇక మ్యాచ్‌లో జ్వెరెవ్ 44, నాదల్ 34 విన్నర్స్ సాధించారు. మ్యాచ్‌లో నాదల్ 38 అనవసర తప్పిదాలు చేశాడు. ఇక భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ తొలి రౌండ్‌కే పరిమితమయ్యాడు.
రష్యా స్టార్ కచనోవ్ చేతిలో 6 6 7 (7 నాగల్ ఓటమి చవిచూశాడు. మరో సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ సిన్నర్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో సిన్నర్ 6 6 6 క్రిస్టోఫర్ యుబాంక్స్ (అమెరికా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ (పొలండ్) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో స్వియాటెక్ 6 6 క్వాలిఫయర్ జీన్‌జీన్‌ను చిత్తుగా ఓడించింది. రెండో రౌండ్‌లో స్వియాటెక్.. నయామి ఒసాకా (జపాన్)తో తలపడనుంది. ఇక మూడో సీడ్ కొకో గాఫ్ (అమెరికా) 6 6 జులియా అవదీవా (రష్యా)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది.






